ఓటమి తప్పాలంటే అతడిని కెప్టెన్‌గా చేయండి..గావస్కర్
భారత్ టీమ్‌ను వరుస ఓటమి వెంటాడుతోంది. ఈ ఓటమి నుండి తప్పించుకోవాలంటే కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించాలని భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో రాణించాలని కోరుకుంటున్నారు. బీసీసీఐని ఉద్దేశించి కీలక వ్యాఖలు చేశారు సునీల్ గావస్కర్. రోహిత్ శర్మ స్థానంలో బుమ్రాను సారధిగా నియమిస్తే బాగుంటుందని సూచించారు. రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండబోడని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెలక్షన్ కమిటీ కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వ్యక్తుల కంటే భారత్ క్రికెట్ మనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.

