బీజేపీని గెలిపించండి: ఈటల జమున
జమ్మికుంట: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే, కాంగ్రెస్‌కు ఓటోస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున ఆరోపించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంటలోని రామన్నపల్లి, ధర్మారం, కొత్తపల్లిలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఆమెకు కార్యకర్తలు, ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

