కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఇక్కడ కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న రూ.కోటి విలువ చేసే కాపర్ తుక్కు అగ్నికి ఆహుతి అయ్యింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో 10 వాటర్ ట్యాంకర్లు, మూడు ఫైర్ ఇంజన్ల సహాయక చర్యలు చేపట్టారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ మంటల తాకిడికి డాకన్ సీ అనే కంపెనీలో యంత్ర సామాగ్రి దెబ్బతిన్నాయని యాజమానులు బాధను వ్యక్తం చేశారు.
Breaking news: