భారీ అగ్నిప్రమాదం..
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పరిష్కార్ అపార్టెమెంట్ ఆరో అంతస్తులో చెలరేగిన మంటలు భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ తల్లి, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. పిల్లలను కింది అంతస్తులో ఉన్నవారికి అప్పగించి, ఆమె ధైర్యం చేసి కిందకు దిగే ప్రయత్నం చేసింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి, 18 మందిని కాపాడినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు.