Home Page SliderInternational

‘టెస్టు మ్యాచ్‌లలో మజానే వేరు’..కోహ్లి

‘నాఆటకు బేస్ ఇచ్చిందే టెస్ట్ క్రికెట్. ఈ మ్యాచ్‌లలో ఆడితే వచ్చే మజానే వేరు’ అంటూ టెస్ట్ క్రికెట్‌పై తన ప్రేమను వ్యక్తపరిచాడు కింగ్ కోహ్లి.  స్టార్ స్పోర్ట్స్ చానెల్ కోసం ఇచ్చిన ఇంటర్యూలో తన టెస్ట్ క్రికెట్ జర్నీ గురించి మాట్లాడాడు విరాట్ కోహ్లి. టెస్ట్ క్రికెట్‌లో  నాలుగైదు రోజుల మ్యాచ్ ఆడిన తర్వాత అనుభూతిని మాటలలో చెప్పలేనని, ఫలితం ఎలాఉన్నా అనుభవం బాగా వస్తుందని పేర్కొన్నాడు. జట్టుకోసం, దేశం కోసం ఇలాంటి సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడితే ఎంతో సంతృప్తి కలుగుతుందన్నాడు. దేశం కోసం వందకు పైగా టెస్టుల్లో ఆడడం తనకెంతో గౌరవంగా ఉందన్నాడు. తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడే టెస్టు క్రికెటర్‌గా మారాలని కలలు కనేవాడినని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో విరాట్‌ను ఔట్ చేయడం చాలా కష్టమని, సచిన్ టెండూల్కర్ మాదిరే విరాట్‌ని ఎల్బీ చేయడం జరగని పని అని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. విరాట్‌కు ఆఫ్ సైడ్ వికెట్ వేసే బంతులను మిడాన్ మీదుగా బౌండరీలుగా మారుస్తాడని చెప్పాడు. ప్రపంచ కప్ ఓటమి తర్వాత బాధ నుండి బయటపడడానికి కుటుంబంతో నెలరోజులు గడిపాడు కోహ్లి. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టుకు సిద్దమవుతున్నప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య అత్యవసర పరిస్థితి వలన భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే డిసెంబర్ 26న మొదటి టెస్టు నాటికి జట్టులో కలుస్తాడని సమాచారం.