మంత్రి సీతక్క చేతుల మీదగా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం
తెలంగాణలో మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. సెక్రటేరియట్‌లో ఇవాళ రెండు మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి ప్రారంభించి, సర్వపిండితో పాటు పలు వంటకాల రుచి చూశారు. ఈ క్యాంటీన్ల ద్వారా అమ్మచేతి వంటను ప్రతి ఇంటికీ అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు. సోలార్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫొటోగ్రఫీ, మీసేవ వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తామన్నారు.

