కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్న మహిళా శక్తి క్యాంటిన్లు
తెలంగాణా సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లు కార్పోరేట్ క్యాంటీన్లకు తీసిపోని విధంగా ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసిన రెండు క్యాంటిన్లు చూడగానే ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఈ క్యాంటీలన్లలో పిండివంటలు, చిరుతిల్లు, స్నాక్స్, స్వీట్లు, పొడులు, పచ్చల్లు, సర్వపిండి, సకినాలు, అరిసెల వంటి తెలంగాణ చిరు తిల్లను విక్రయిస్తున్నారు. మహిళా శక్తి క్యాంటీన్ల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి సీతక్క సర్వపిండిని కొనుగోలు చేసారు. మహిళా సంఘ సభ్యుల ఆతిధ్యాన్ని స్వీకరించి పిండి వంటల రుచి చూసారు. పచ్చడితో గారెలను రుచి చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ ఇంటిలో తిన్నట్లుగానే పిండి వంటలు రుచిగా ఉన్నాయని మంత్రి కితాబిచ్చారు. దినదినాభివృధ్దిగా వ్యాపారం వర్దిల్లాలని ఆకాక్షించారు. తమకు శిక్షణ ఇచ్చి క్యాంటీన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మహిళా సంఘాల సభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మీ సహకారంలో మరింత ముందుకు వెళ్తామన్నారు.