‘హ్యాపీ 12 మై సన్‌షైన్’ అంటూ సితారకు మహేశ్ బర్తడే విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ముద్దుల కుమార్తె సితారకు బర్తడే విషెస్ చెప్పారు. ఎక్స్‌లో సితార ఫోటో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్తడే మై సన్‌షైన్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. మరోపక్క ఆయన సతీమణి నమ్రత కూడా తమ క్యూట్ బేబీకి బర్తడే విషెస్ చెప్పారు. చిన్నారి సితార పోటోలు, వీడియోలతో క్రియేట్ చేసిన స్పెషల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నువ్వు ఎల్లప్పుడూ నాకు ట్రావెల్ గైడ్‌లా ఉంటావు. చిట్టి ప్రయాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు, ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అంటూ క్యాప్షన్ పెట్టారు. సర్కారువారి పాట చిత్రం ప్రమోషన్ సాంగ్‌లో పెన్నీ అంటూ స్క్రీన్‌పై కనిపించింది సితార. 12 ఏళ్లకే ఎంతో పరిణితి సాధించిన ఉదాత్త స్వభావం కలిగింది. తరచూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. భవిష్యత్తులో హీరోయిన్‌గా నటిస్తానని పేర్కొంది. ఇటీవల నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి, పారితోషకాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగించింది.