Home Page SliderTelangana

మహేశ్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు భారీ జరిమానా

ఇంటర్ నెట్ సేవల విషయంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని రుజువవడంతో రిజర్వ్ బ్యాంకు మహేశ్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. ఖాతాదారుల అకౌంట్లకు సైబర్ భద్రతా జాగ్రత్తలు తీసుకోలేదని మహేశ్ సహకార బ్యాంకుకు 65 లక్షల రూపాయల జరిమానా విధించింది రిజర్వ్ బ్యాంకు. దీనితో పాటు ఇదే అంశంపై మహారాష్ట్రలోని దోంబివిల్ నగర సహకార బ్యాంకుకు 50 లక్షల రూపాయలు జరిమానా విధించింది. గడిచిన మూడు నెలలలో తెలంగాణాలోని రెండు సహకార బ్యాంకులకు కూడా ఇలాగే జరిమానాలు విధించింది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్, అకౌంట్ల సైబర్ భద్రతలపై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన భాద్యత బ్యాంకులదే నని వెల్లడించింది రిజర్వ్ బ్యాంకు. అర్భన్ బ్యాంకులను కూడా ఈ మధ్యనే బ్యాంకింగ్ నియంత్రణ చట్టం పరిధిలోకి తెచ్చారు. దీనితో రిజర్వ్ బ్యాంకు నిఘా కిందకు వస్తున్నాయి. దీనితో లోపాలుంటే తగిన జరిమానాను విధిస్తోంది ఆర్‌బీఐ.