Home Page SlidermoviesNationalTrending Today

‘మెన్స్‌డే’ సందర్బంగా మహేశ్ బాబు స్పెషల్ పోస్టు

‘మెన్స్‌డే’ సందర్భంగా స్టార్ హీరో మహేశ్ బాబు స్పెషల్ పోస్ట్ పెట్టారు. తాను గతంలో పాడిన పాటను షేర్ చేశారు. అసలైన మగాడంటే వాడే అంటూ లింగ సమానత్వంపై ప్రచారంలో భాగమయ్యారు. మెన్ అగైనెస్ట్ రేప్ అండ్ డిస్‌క్రిమినేషన్ (మార్డ్) అనే మిషన్‌లో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌తో చేతులు కలిపారు. దీనికోసం ఫర్హాన్ తండ్రి రచయిత జావేద్ అక్తర్ హిందీలో రాసిన కవితను తెలుగులో పాడారు మహేశ్. మహిళలపై అత్యాచారాలు, హత్యలను వ్యతిరేకిస్తూ ఈ మార్డ్ ప్రచారాన్ని ప్రారంభించారు.

‘ఎవరు పక్కన ఉంటే మహిళ ధైర్యంగా ఉంటుందో అలాంటి వాడే స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు’. అంటూ పాడారు మహేశ్ బాబు . ఈ మూమెంట్‌లో క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, నటుడు ఫర్హాన్ అక్తర్, గాయకుడు షాన్ ఈ ప్రచారంలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఫర్హాన్ మాట్లాడుతూ ‘నేను అద్దంలో చూసుకున్నప్పుడు మా అమ్మ, సోదరి, భార్య, కుమార్తె గర్వంగా మా మనిషి అని చెప్పుకునే వ్యక్తిగా కనిపించాలి’ అని పేర్కొన్నారు.