మహేష్ బాబు కొత్త లుక్ అదుర్స్ కదూ..!
సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా తయారవుతున్నారు. కాగా 47 ఏళ్ల వయస్సులో ఆయన 20 ఏళ్ల కుర్రాడిలా కన్పిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్త హెయిర్ స్టైల్‌తో ,సన్‌గ్లాసెస్ ధరించి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మహేష్ బాబు కొత్త లుక్‌తో అదరగొడుతున్నారని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు SSMB28 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా..SS తమన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా పూజా హేగ్దే నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనలరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

