Home Page SliderTelangana

సీఎం సహాయనిధికి మహేశ్ బాబు విరాళం

వరద బాధితుల సహాయార్థం అగ్ర నటుడు మహేశ్ బాబు సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన మహేశ్ బాబు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏసియన్ మహేష్ బాబు సినిమాస్ (AMB) తరపున కూడా మరో 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. మహేశ్ వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పొడవాటి జుట్టు, గడ్డంతో మహేశ్ న్యూలుక్ అభిమానులకు ఆకట్టుకుంటోంది. తన నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29లో ఆయన ఈ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.