లయన్ కింగ్‌కు మహేష్‌బాబు వాయిస్ ఓవర్..
వాల్ట్ డిస్నీగా రూపొందించిన చిత్రం ‘ది లయన్ కింగ్’ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఫ్రాంచైజీలో కొత్త సినిమాగా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పలు భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు ముఫాసా పాత్రకు అగ్ర హీరో మహేష్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు ట్రైలర్‌ను ఈ నెల 26న విడుదల చేస్తారు. ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పడం పట్ల మహేష్‌బాబు హ్యాపీ ఫీల్ అయ్యారు. తన కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ ఇదేనని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘డిస్నీ సంస్థ చిత్రాల్లోని ఎంటర్‌టైన్‌మెంట్, స్టోరీటెల్లింగ్ అంటే నాకు భలే ఇష్టం. అడవికి రారాజైన ముఫాసా పాత్రకు వాయిస్ అందించడంలో నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను చూసిన వారందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. తెలుగు వెర్షన్‌కు మహేష్‌బాబు వాయిస్ ఓవర్ జీవం పోసిందని డిస్నీస్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ అన్నారు. ఈ చిత్రానికి బారీజెంకిన్స్ డైరెక్షన్ చేశారు.

