Home Page SliderNational

రాయన్ సినిమాపై మహేష్‌బాబు ప్రశంసలు..

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ కెరీర్‌లో 29వ సినిమాగా తెరకెక్కనుంది. అయితే ఈ భారీ సినిమా గ్యాప్‌లో మహేష్ బాబు తన సమయాన్ని ఫ్యామిలీతోను గడుపుతూ తన సినిమా కోసం పలు సినిమాలు  చూసేందుకు కేటాయిస్తున్నారు.

అలా కోలీవుడ్‌లో రీసెంట్‌గా హిట్ అయిన సినిమా “రాయన్” పై మహేష్ ప్రశంసల జల్లు కురిపించారు. ధనుష్ నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాని మహేష్‌బాబు ఎంతగానో ప్రశంసించారు. దీనితో తమిళ ఆడియెన్స్ ఇపుడు సోషల్ మీడియాలో మహేష్ విశాల హృదయానికి ఫిదా అయిపోయారు.

ఇలా జీరో ఈగోతో అది కూడ పక్క ఇండస్ట్రీ నుంచి తమిళ సినిమాని ప్రశంసించడం ఆనందంగా ఉందని, కోలీవుడ్ నుంచే ఎంతోమంది ఉన్నప్పటికీ సినిమా గురించి ఏమీ మాట్లాడలేదు అని, మహేష్ విషయంలో తమిళ ఆడియెన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ ఇచ్చిన రివ్యూపై ధనుష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తన టీం అంతా ఎంతో థ్రిల్‌కు గురయ్యామని మహేష్‌కి రిప్లై ఇచ్చాడు.