ఏసీబి వలలో మహబూబ్ నగర్ డీఈవో
ఓ టీచర్ ని లంచం డిమాండ్ చేసి ఏసీబికి అడ్డంగా దొరికిపోయాడు మహబూబ్ నగర్ డీఈవో.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ఓ టీచర్ ని సీనియర్ లిస్ట్ లో చేర్పించడానికి రూ.50వేలు డిమాండ్ చేశాడు ఆ జిల్లా డీఈవో రవీందర్.దీంతో గత్యంతరం లేక ఆ టీచర్ ఏసిబిని ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో పథకం ప్రకారం వలపన్ని లంచగొండి డీఈవోని పట్టుకున్నారు.దీంతో మహబూబ్ నగర్ లో డీఈవో వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

