మహారాష్ట్రలో మహాయతి జోరు..
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో మహాయతి కూటమి జోరు చూపిస్తోంది. కౌంటింగ్ కొనసాగుతుండగా, మహాయతి కూటమిలోని పార్టీలు ఆధిక్యత కనపరుస్తున్నాయి.
మహాయతి కూటమిలోని బీజేపీ 98 సీట్లు, శివసేన (శిండే) 38 సీట్లు, ఎన్సీపీ(అజిత్ పవార్) 25 మొత్తంగా 161 సీట్లలో ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ 38, శివసేన (ఉద్దవ్ థాక్రే) 37, ఎన్సీపీ (శరద్ పవార్) 38 స్థానాలలో మొత్తంగా 113 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నారు.
ఇతరులు 12 స్థానాలలో ఆధిక్యతో కొనసాగుతున్నారు.