Home Page SliderTelangana

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 681 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 69 , పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 132 , విద్యుత్ శాఖ కు సంబంధించి 87, హౌసింగ్ కు సంబంధించి 232 దరఖాస్తులు,  పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 31, ఇతర శాఖలకు సంబంధించి 130 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.