వరంగల్‌కు మహర్థశ..రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వరంగల్‌కు మహర్థశ పట్టబోతోందని వ్యాఖ్యానించారు. అక్కడ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సభలలో పాల్గొనబోతున్నారు. అక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించబోతున్నారు. వరంగల్ కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టులు పెట్టారు. ‘మనందరి భవిష్యత్తు కోసం వరంగల్ దశ-దిశ మార్చేందుకు నేడు వస్తున్నాను అని పేర్కొన్నారు. తెలంగాణ చైతన్యపు రాజధాని, కాళోజీ నుండి పీవి వరకూ ఎందరో మహనీయులకు జన్మనిచ్చింది. సమ్మక్క- సారలమ్మలు నడియాడిన ప్రాంతం. దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ యుద్ధం చేసిన నేల.’ అంటూ కొనియాడారు.

