ఔను వాళ్లిద్దరూ కలిశారు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణలో మహాపరినిర్వాణ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరస్పరం పలకరించుకొని కాసేపు సరదగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఖర్గే మోదీ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడూ పరస్పర విమర్శలు చేసుకొనే నేతలు ఒకే చోట నవ్వులు పూయిస్తూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరై నివాళులర్పించారు.