Andhra PradeshHome Page Slider

మహా శివరాత్రి, వైసీపీ ట్వీట్ రాజకీయ దుమారం

మహా శివరాత్రి సందర్భంగా YSRCP అధికారిక ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసిన చిత్రం చుట్టూ వివాదం రాజుకుంటోంది. ఒక వర్గం ప్రజలతోపాటుగా, బీజేపీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వైఎస్సార్‌సీపీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ ట్వీట్ హిందూ మతాన్ని అవమానించడమేనని పేర్కొంటూ, అధికారిక హ్యాండిల్‌లో పోస్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు కోరారు. శివునిగా చిత్రీకరించబడిన బాలుడికి పాలు గిన్నెతో ముఖ్యమంత్రి తినిపిస్తున్నట్లు చూపుతున్న చిత్రం పెద్ద వివాదంగా మారింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేశారని విమర్శించారు. కాగా, అధికార పార్టీ వేసే ప్రతి అడుగును రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, కాషాయ పార్టీ అలా చేయడం మానుకోవాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహా వైఎస్సార్‌సీపీ మంత్రులు అన్నారు.