జూన్ 4న మహా ధర్నా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించిన వారిపైనే నోటీసులు ఇస్తారా అని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి, గుత్తేదారులకు వంతపాడుతూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని కవిత ఆరోపించారు. జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి తరఫున మహా ధర్నా చేపడతామని, ఈ కుట్రలను ప్రజల ముందు బట్టబయలు చేస్తామని కవిత తెలిపారు.

