వైభవంగా నటి వివాహం..హాజరైన సినీ ప్రముఖులు
కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, నికోలయ్ సచ్‌దేవ్‌ల వివాహం థాయ్‌లాండ్‌లో జూలై 2 జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన వీరి రిసెప్షన్ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు, సినీనటులు హాజరయ్యి సందడి చేశారు. టాలీవుడ్ నుండి బాలకృష్ణ, వెంకటేష్, మంచులక్ష్మి హాజరుకాగా, కోలీవుడ్ నుండి రజనీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బూ, శోభన వంటి నటులు హాజరయ్యారు. విభిన్న పాత్రలతో వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించారు. నికోలయ్ సచ్‌దేవ్ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. 14 ఏళ్లుగా ప్రేమించుకున్న వీరిద్దరూ తాజాగా వివాహబంధంతో ఒక్కటయ్యారు.