మాఘ పౌర్ణమి ఎఫెక్ట్.. ప్రయాగలో నో వెహికల్ జోన్..
మాఘమాసంలో అతి ముఖ్యమైన మాఘ పౌర్ణమి స్నానానికి కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. భారీగా భక్తులు తరలి రావడంతో దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనితో అధికారులు కొత్త ఆంక్షలు అమలులోకి తెచ్చారు. నేటి ఉదయం నుండి ప్రయాగ్ రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. జబల్ పూర్- ప్రయాగ్ రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల మేర నిలచిపోయిన వాహనాల ట్రాఫిక్ జామ్ ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్‌గా చరిత్రకెక్కింది. దీనితో రెండు రోజుల పాటు ఎవరూ ప్రయాగ్ రాజ్ రావొద్దంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. జబల్ పూర్, సివనీ, కట్నీ, సాత్నా, రివా, మైహర్ జిల్లాలలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి.