Home Page SliderTelangana

ఆదరించిన బీజేపీకే మాదిగల చేయూత: మంద కృష్ణ

బోరబండ: ఎస్సీ వర్గీకరణ కోసం హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మాదిగలు నమ్మొద్దని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా రోడ్ షో, రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ దళిత అధ్యయన కేంద్రం వద్ద మాదిగల ఆశీర్వాద సభలో ప్రసంగించారు. మాదిగలను 20 ఏళ్లు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, అణచివేసిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మాదిగ జాతి జీవితంలో నమ్మదన్నారు. బీజేపీని గెలిపిస్తే ముఖ్యమంత్రి కావాలన్న బీసీల కల నెరవేరుతుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థులు అందెల శ్రీరాములు యాదవ్, లంకాల దీపక్‌రెడ్డి పాల్గొన్నారు.