వైరల్‌గా మారిన మధ్యప్రదేశ్ సీఎం కత్తి విన్యాసం వీడియో
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే గతంలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కత్తి విన్యాసం చేశారు. కాగా ఆ వీడియో ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీఎం మోహన్ యాదవ్ రెండు చేతులతో కత్తులను మెరుపు వేగంతో తిప్పడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే కాసేపట్లో భోపాల్ నగరంలోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.