Home Page SliderNational

‘సలార్’ చిత్రం నుండి మరో లిరికల్ సాంగ్

ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న ‘సలార్’ చిత్రం శుక్రవారం(డిసెంబర్ 22) రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఒక లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘ప్రతీ గాథలో రాక్షసుడు’ అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్‌ చిన్ననాటి స్నేహితుడిగా, శత్రువుగా మారే కేరక్టర్‌లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రియారెడ్డి, టినూ ఆనంద్, ఈశ్వరిరావు కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగులన్నీ పూర్తయిపోయాయి.