అదరగొట్టిన లక్నో..కేకేఆర్ ముందు భారీ లక్ష్యం..
కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. లక్నో బ్యాటర్లు అదరగొట్టారు. నికోలస్ పూరన్(87), మిచెల్ మార్ష్(81) పరుగుల వరదపారించారు. మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి, 238 భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా 2, అండ్రూ రస్సెల్ 1 వికెట్‌తో సరిపెట్టుకున్నారు. కోల్‌కతా ముందు 239 పరుగుల భారీ లక్ష్యాన్నుంచారు.

