సీఎం నిధికి భారీ విరాళం ఇచ్చిన ఎల్ అండ్ టీ సంస్థ
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఎల్ అండ్ టీ సంస్థ భారీ విరాళం అందజేసింది. వరద బాధితుల సహాయార్థం ఈ సంస్థ రూ.5.50 కోట్ల విరాళాన్ని సమర్పించింది. దీనికి గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సంస్థ ఛైర్మన్ కలిసి చెక్కును అందజేశారు.