LSG టీమ్ “బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్”
ఈ IPL సీజన్‌లో ఎలాగైన కప్పు సాధించాలని ఎన్నో ఆశలతో ఈ సీజన్‌లో అడుగు పెట్టింది LSG టీమ్. ఈ నేపథ్యంలో IPL ప్రారంభం నుంచే ప్రత్యర్థి టీమ్‌లకు గట్టి పోటి ఇస్తూ..ఎట్టకేలకు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంది. అయితే ప్లేఆఫ్స్‌లో మాత్రం తమ ప్రత్యర్థి జట్టు MI చేతిలో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీంతో LSG టీమ్ ఇంటి బాట పట్టారు. ఈ క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.కాగా ఈ IPL సీజన్ నుంచి LSG జట్టు వైదొలగడంతో జట్టు సభ్యులంతా ఇంటికి పయనమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన ప్లేయర్స్ కూడా స్వదేశానికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్లేయర్స్ అందరికీ వచ్చే ఏడాది వరకు వీడ్కోలు పలుకుతూ…హోటల్ నుంచి ప్లేయర్లు వెళ్లిపోతున్న వీడియోను LSG టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వచ్చే సంవత్సరం జరగబోయే IPL లోనైనా LSG కప్పు కొట్టాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

