Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

భారత్ లో అతి తక్కువ ధరకు డేటా

ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు డేటా లభించే దేశం భారతదేశమే. అందుకే ఇక్కడ డిజిటల్ లావాదేవీలు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అజార్ బైజాన్ రాజధాని బాకులో జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వేదికపై జరిగిన వరల్డ్ టెలి కమ్యూనికేషన్ డెవలప్ మెంట్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అతితక్కువ ధరకు భారత్ లో డేటా లభ్యత ఉందని, అందుకే ప్రపంచ డిజిటల్ లావాదేవీలలో 46 శాతం భారత్ నుండే జరుగుతున్నాయని చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇప్పటిదాకా దాదాపు 66 లక్షల మేర ఆర్థిక మోసాలను నివారించాం, డిజిటల్ మోసాలు అరికట్టేందుకు మోసపూరిత టెలికాం కనెక్షన్లు నిలిపివేశాం అంటూ వెల్లడించారు.