Home Page SliderNational

లవర్స్ డే.. మాజీ ప్రియుడికి షాక్ ఇచ్చిన యువతి

ప్రేమికుల రోజు సందర్భంగా తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు సర్ ప్రైజ్ ఇద్దామని అనుకుంది ఓ యువతి. వాలంటైన్స్ డే రోజుని ఆమె ఏకంగా 100 పిజ్జాలను ఆన్ లైన్ లో అతడి కోసం ఆర్డర్ పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి క్యాష్ ఆన్ డెలివరీతో వీటిని ఆర్డర్ చేసింది. అది చూసిన మాజీ బాయ్ ఫ్రెండ్ యష్ షాక్ కు గురయ్యాడు. డబ్బులిచ్చేది లేదంటూ డెలివరీ బాయ్ తో యష్ గొడవ పడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.