ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని తన కిడ్నీ అమ్ముకున్న ప్రేమికుడు
తన ప్రేమికురాలికి ఐఫోన్ 16 ప్రో గిఫ్ట్ ఇవ్వాలని భావించిన ఓ ప్రేమికుడు .. తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఏకంగా కిడ్నీని అమ్ముకున్నాడు. ఇదంతా ప్రేమ కోసమేనని చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇతను చేసిన ఘనతపై నెటిజన్లు మండిపడ్డారు. ముందు చదువు మీద ఫోకస్ చెయ్.. తర్వాత ఇలాంటి ఎక్స్ ట్రాలు చేద్దువు కానీ అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. యువత ఇంత దారుణంగా ఉందేంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ ఐఫోన్ 16ప్రో (256GB)వేరియంట్ ధర సుమారు రూ.1,29,900 నుంచి మొదలవుతుంది.