జోరుగా ఝార్ఖండ్ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు
ఝార్ఖండ్ అసెంబ్లీ పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ దాదాపు 40 శాతం పోలింగ్ పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ తన ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. రాంచీలోని పోలింగ్ కేంద్రంలో ఆయన తన భార్య సాక్షితో కలిసి ఓటేశారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. దీనిలో 15 జిల్లాలలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలో ప్రధాన అభ్యర్థులలో మాజీ సీఎం చంపయీ సోరెన్, మాజీ సీఎం మధు కోడా సతీమణి కోడా, మాజీ సీఎం రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్, కాంగ్రెస్ నేత బన్నాగుప్తా వంటి వారు ఉన్నారు.
మరోపక్క వయనాడ్‌లో లోక్‌సభ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయగా, ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలో ఉన్నారు.