Andhra PradeshHome Page SliderSpiritualTrending Today

తిరుమలలో జోరుగా సెలబ్రెటీల  ప్రోటోకాల్ దర్శనాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా సెలబ్రెటీల ప్రోటోకాల్ దర్శనాలు జోరుగా కొనసాగాయి. వారికి నేటి తెల్లవారుజామున అభిషేక సేవ అనంతరం 3.45 గంటలకే దర్శనాలకు అనుమతించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ రఘురామకృష్ణరాజు, హోం మంత్రి అనిత, మంత్రులు సవిత, పార్థసారథి, నిమ్మల రామానాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి సుహాసిని, నందమూరి రామకృష్ణ తదితరులు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మరోపక్క లక్షలాది భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు.