ఏపీలో మద్యం షాపులకు లాటరీలు..ఉద్రిక్తత
ఏపీలో మద్యం షాపులకు లాటరీ ప్రక్రియలు జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లాటరీలో కూటమి నేతలకు సంబంధించిన వ్యక్తుల హవా కొనసాగుతోంది. అనంతపురంలో మద్యం టెండర్లు బీజేపీ నేతలు చేజిక్కించుకున్నారు. ఏలూరులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దరఖాస్తుదారులు మినహా ఇతర వ్యక్తులు రాకూడదంటూ పోలీసుల చెప్పినా, చింతమనేని ప్రభాకర్ అనుచరులు దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనితో ఉద్రిక్తత నెలకొంది. కూటమి నేతలు కమిషన్లు తీసుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.

