కేసీఆర్ వల్లనే రాష్ట్రానికి నష్టం
సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. కె. లక్ష్మణ్ మరోసారి మండిపడ్డారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఏపీ, తమిళనాడులో పార్టీలకు అతీతంగా ప్రధాని మోదీ పర్యటనను ఆహ్వానిస్తుంటే తెలంగాణాలో మాత్రం సీఎం స్వాగతించడం లేదని లక్ష్మణ్ తప్పుపట్టారు. ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి కేసీఆర్ హాజరవ్వాలని లక్ష్మణ్ కోరారు. మరోవైపు ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని కమ్యూనిస్టులు పార్టీలు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. మోడీ రావొద్దని హోర్డింగ్స్ ఎలా పెడతారని లక్ష్మణ్ అడిగారు. ప్రధాని పర్యటనను రాజకీయం ఎలా చేస్తారని ప్రశ్నించారు.

