Home Page SliderNewsTrending Today

ఆ విజువల్స్ మీరు ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నా- ఎన్టీఆర్

జూ. ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 27 సెప్టెంబర్‌న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కారణంగా భారీగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మూవీ టీం ఆ ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ “సినిమాలో ఫలానా చోటే యాక్షన్ బాగుంటుంది అని చెప్పలేను. సినిమా అంతా అద్భుతంగా ఉంటుంది. ఆ విజువల్స్ మీరు ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను” అని చెప్పారు. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.