Breaking Newshome page sliderHome Page SliderInternationalNewsPoliticsviral

మా ఇల్లు చూస్తే దేశ చరిత్ర తెలుస్తుంది : మరియా కొరినా

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా ఇటీవల సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోటీపడినా గెలుచుకోలేకపోయిన నోబెల్ శాంతి బహుమతి ఆమెనే వరించింది. ఒక రకంగా ఆమె కుటుంబం వెనెజువెలా చరిత్ర పాఠంగా కనిపిస్తుంది. దేశాన్ని ప్రేమించాలనే ఆమె పూర్వికుల నుండీ వస్తున్న సంప్రదాయమే దీనికి కారణం. ఆమె కుటుంబం తరతరాలుగా మాతృదేశం కోసం త్యాగం చేశారు. జైలు జీవితం అనుభవించారు. దేశభవిష్యత్తు, శ్రేయస్సు అన్నింటికన్నా ముఖ్యం అనే మాటలు వింటూ పెరిగింది ఆమె.
ఆమె సక్సెస్ కు ఆమె నైతిక విలువలు, కుటుంబ వారసత్వం, ఉద్యమ సంబంధాలే కారణం. ఆమె ఈ విషయాలను ఇటీవల వెల్లడించారు. మా ఇల్లు కూడా దేశచరిత్రలో భాగంగా అనిపిస్తుంది. మా పూర్వికుడైన రచయిత ఎడ్వర్డే బ్లాంకో ‘వెనెజువెలా హీరోయిక’ అనే పుస్తకాన్ని రాశారు. మా అమ్మమ్మ ఆయన మనవరాలే. నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని..ఆయన చిన్న వయసులోనే హత్యకు గురయ్యారు అని పేర్కొంది. ‘ఏ వ్యక్తీ అజ్ఞాతంలో ఉండాలనుకోరు. కానీ నన్ను టెర్రరిస్ట్ గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజెస్ రావడం వల్ల నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్తపడి అజ్ఞాతవాసం చేశాను. కానీ అది నన్ను మరింత తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తి సమకూర్చుకోవడానికి ఉపయోగపడింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న విషయం గుర్తుకొచ్చినప్పుడు కుటుంబం గురించి భయం పుట్టుకొస్తుంది’. అని తన గతాన్ని గుర్తు చేసుకుంది. సమాజానికి ఎంతో కొంత తన వంతు తిరిగి ఇవ్వాలనేది మా అమ్మ చెప్పే మాట. దానిని ఎప్పడూ మరిచిపోలేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ ఐరన్ లేడీ.