Home Page SliderNational

రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు.. బైకర్‌ ఏం చేశాడో చూడండి!

రైల్వే గేటు వద్ద కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. రైలు గేటు వేసినా కూడా కొందరు అడ్డదిడ్డంగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రైలు వస్తండడంతో రైల్వే సిబ్బంది గేటును మూసేశారు. దీంతో గేటుకు రెండు వైపులా వాహనాలన్నీ ఆగిపోయాయి. ఓ వ్యక్తి గేటుకు పక్కనే బైకు ఆపుకొని ఉన్నాడు. అయితే.. ఎంత సేపటికి గేటు తెరవకపోవడంతో అతడికి చిరాకు పుట్టింది. చివరకు ఏకంగా ఏకంగా బైక్‌ను భుజంపైకి ఎత్తుకున్నాడు. తర్వాత ఎంచక్కా దాని మోసుకుంటూ రైలు గేటు పక్క నుంచి వెళ్లి రైలు పట్టాలు దాటేశాడు. సాధారణంగా బైకర్లు రైలు గేటు కింద నుంచి దూరిపోవడం చేస్తుంటారు. అయితే ఇతను మాత్రం అందుకు విరుద్ధంగా ఇలా విచిత్రంగా రైలు పట్టాలు దాటడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇతడి విచిత్ర విన్యాసం చూసి అంతా అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.