Home Page SliderTelangana

హైదరాబాద్ లో త్వరలో లూ-కేఫ్స్

హైదరాబాద్ లోని టాయిలెట్ల రూపు రేఖలు మారనున్నాయి. పూర్తి హైటెక్ హంగులతో స్మార్ట్ టాయిలెట్ రివల్యూషన్ లో భాగంగా నగరమంతటా ‘లూ కేఫ్స్’ అందుబాటులోకి రానున్నాయి. ఇందులో పబ్లిక్ టాయిలెట్ తో పాటు కేఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ అవడమే కాదు.. కాసేపు ఫ్రెండ్స్ తో రిలాక్స్ గా కూర్చుని కాఫీ త్రాగుతూ కబుర్లు కూడా చెప్పుకోవచ్చు. దేశ వ్యాప్తంగా అర్బన్ శానిటేషన్ లో భాగంగా ‘స్మార్ట్ ఈ-టాయిలెట్స్’ను తీసుకురావాలని కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మార్ట్ టాయిలెట్లు లగ్జరీగా ఉంటాయి. అత్యాధునిక సౌకర్యాలుంటాయి. ఆటోమేటిక్ ఫ్లషింగ్, పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా రూంలు, వాయిస్ అసిస్టెంట్, పవర్ బ్యాకప్, ఆటోమేటెడ్ ఫ్లషింగ్ సెన్సార్లు వంటివి ఉంటాయి. ఇవి నిత్యం పూర్తిగా పరిశుభ్రంగా ఉంటాయి. మహారాష్ట్రలోని పింప్రి చించ్ వాడ్ లో వివిధ ప్రాంతాల్లో 26 లూ కేఫ్స్ రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఇవి హైదరాబాద్ లోనూ కూడా కనిపించనున్నాయి.