Andhra PradeshHome Page Slider

కడప ఘటనపై లోకేష్ ఆవేదన

కడపలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి ఒక బాలుడు మరణించాడు. నగర పరిధిలోని ఇద్దరు బాలురు సైకిల్‌పై స్కూల్ నుండి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. తన్వీర్ అనే 11 ఏళ్ల బాలుడు మరణించగా, మరొకరు ప్రమాద స్థితిలో ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఆవేదన చెందారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని, మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.