Andhra PradeshHome Page Slider

జగన్ పేదరికాన్ని వివరించిన లోకేష్

ఏపీ సీఎం జగన్ పేదరికాన్ని వివరించారు తెలుగుదేశం నేత లోకేష్. జగన్ ఏ సభలోకి వెళ్లినా తనకు ఏమీ లేదని, ప్రజల ఆశీస్సులే తనకు బలం అంటూ ఉంటారని ఎద్దేవా చేశారు. జగన్ జబరస్త్‌ కామెడీ చేస్తున్నాడని, జగన్ ఒంటరివాడు, పేదవాడు అని చెప్పుకుంటున్నాడని, లక్షకోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన జగన్ పేదవాడెలా అవుతాడని ప్రశ్నించారు. ఒక సిమెంట్ కంపెనీ, సొంత న్యూస్‌ పేపర్, సొంత టీవీ ఛానెల్, విద్యుత్ కంపెనీ ఉన్న జగన్ పేదవాడెలా అయ్యాడని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో లోటస్ పాండ్‌లో భవంతి, బెంగళూరులో ఎకరాల స్థలంలో బిల్డింగులు, దుబాయిలో, విశాఖలో విల్లాలు గల జగన్ పేదవాడా అని మండిపడ్డారు. వేల రూపాయల వాటర్ బాటిల్‌లో నీళ్లు త్రాగుతారని, లక్ష రూపాయల చెప్పులు వేసుకుంటున్నారని ప్రజలు గమనించాలని అన్నారు. 500 కోట్ల సంపాదనతో దేశంలోనే ‘రిచ్చెస్ట్ సీఎం’గా మారిన  జగన్ రాజు పేద డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియాలో మీమ్స్‌తో సెటైర్లు వేస్తున్నారు.