ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున ఆయన తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో లోకేష్‌ను ఏ14గా సీఐడీ పేర్కొంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలోని అన్ని రహదారులను అనుసంధానించే లక్ష్యంతో అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) ప్రాజెక్టును రూపొందించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా సీఐడీ గత ఏడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. విచారణలో సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును ప్రధాన నిందితుడిగా పేర్కొంది.

