కొత్తగా తీసుకొచ్చిన 3 నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌సభ ఆమోదం
ఢిల్లీ: బ్రిటిష్ హయాం నుంచీ అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 3 నేర శిక్షాస్మృతి బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్).. పేరుతో ఈ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. గురు, శుక్రవారాల్లో ఏదో ఒక రోజున వాటిని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అక్కడా ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకమైతే అవి చట్టాలుగా మారతాయి.


 
							 
							