ఐటీ కంపెనీల లాగౌట్ మరో 2 వారాలు పొడిగింపు
హైదరాబాద్‌ను వణికిస్తున్న భారీ వర్షాల కారణంగా సైబరాబాద్‌లో, ఐటీ కారిడార్‌లలో ప్రత్యేక లాగౌట్ సమయం పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిని మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు పొంగిపారడం, రోడ్ల మీదకు నీటి ప్రవాహం కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో కొన్ని ప్రాంతాలలో కంపెనీలకు ఒక్కొక్క ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. మరో రెండు వారాల పాటు ఇదే లాగౌట్ సమయం అమలుచేయాలని కమిషనర్ సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా వివిధ ప్రాంతాలలో పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా చెరువులలో ప్రవాహాల తీరు పరిశీలిస్తున్నారు. సహాయక చర్యలపై కమిషనరేట్‌లోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్‌లో సమీక్షించారు.

