ఇంటి చుట్టూ తాళాలు.. ఇంటి లోపల మృతదేహం..
ఓ ఇంటి లోపల ఐదు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహం ఉంచి ఇంటికి తాళాలు పెట్టారు. ఈ ఘటన తెలంగాణ లోని జగిత్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని కొడిమ్యాల మండలంలో ఆవుదుర్తి మమత (32) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఐదు రోజులుగా ఇంట్లో మృతదేహం, దుర్గంధంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు లేదా హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు.