Home Page SliderTelangana

మల్కాజిగిరిలో లోకల్ పోరు

పార్లమెంట్‌  ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఎన్నికల లాగే లోకల్ పోరు కొనసాగుతోంది. అందుబాటులో ఉండే లోకల్ నాయకులనే గెలిపించాలంటూ ప్రచారం మమ్మురమవుతోంది. ‘మేము పక్కా లోకల్ అంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థులు మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లలో బీజేపీ ఎంపీ ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు, కాంగ్రెస్ అభ్యర్థి సునీతను కలవాలంటే 59 కిలోమీటర్లు వెళ్లాలి. కానీ బీఆర్‌ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని కలవాలంటే ఎక్కడికీ వెళ్లక్కరలేదు. పక్కా లోకల్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ఎంపీ సీటు వరించేదెవరినో వేచి చూడాల్సిందే.