త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా..
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, ఆ మేరకు పార్టీ కార్యకర్తలు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా కోహెడలో పర్యటించిన మంత్రి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచే నేతలు వ్యూహాత్మకంగా పని చేయాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ. 30 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
Breaking news: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..