జూలై నుండే రుణమాఫీ
జూలై నెల నుండే రుణమాఫీ ప్రక్రియను మొదలుపెడతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలకు ఇచ్చిన రుణమాఫీని తప్పకుండా అమలు చేస్తామని, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చేయలేని పనిని కాంగ్రెస్ చేసి చూపిస్తుండడంతో తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. తమ ప్రభుత్వం రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేసి అన్నదాతల కళ్లలో వెలుగును, ఆనందాన్ని తెస్తామని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు ఇస్తామన్నారు.

