Home Page SliderTelangana

అర్హులకే రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలి: గుత్తా సుఖేందర్ రెడ్డి

టిజి: అర్హులైన వారికే రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సంపన్నులు, పన్నులు కట్టేవారిని పథకం నుండి తొలగించాలని సూచించారు. రైతు భరోసా నుండి వ్యవసాయం చేయని భూములు తొలగించాలన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని చెప్పారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టారని తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.